Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చర్యలు తీసుకోవాలి మైనార్టీ జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా
నవతెలంగాణ-కొత్తగూడెం
అన్నపురెడ్డి మండల పరిధిలోగల ఎర్రగుంట గ్రామంలోని ఖబరస్తాన్ (ముస్లిం స్మశాన వాటిక) స్థలంలోని సమాధులను కూల్చిన కాంట్రాక్టర్‌పై, వారికి సహకరించిన సంభందిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు యండి.యాకూబ్ పాషా డిమాండ్ చేసారు. శుక్రవారం పెద్దిరెడ్డిగూడెం ముస్లిం సోదరులతో కలిసి కలెక్టర్ అనుదీప్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో గల అన్నపురెడ్డి పల్లి మండలంలోని పెద్దిరెడ్డిగూడెం గ్రామంలో సర్వే నెం19/1/చ /1 నందు ముస్లింలకు చెందిన 2 ఎకరాల భూమి స్మశాన వాటిక క్రింద గత 30 సంవత్సరాల నుంచి ఉందని తెలిపారు. ఈ ముస్లింల స్మశాన వాటికలో పూర్వీకుల సమాదూలతో పాటు చనిపోయిన ముస్లింలను ఈ ఖబరస్తాన్‌లో దహన సంస్కారాలు చేసుకుంటున్నారు. బుధవారం ముస్లిం స్మశాన వాటిక యందు గల సమాధులను రోడ్ కాంట్రాక్టర్ వారి పనిమనుషులు చేత జెసిబితో సమాధులను కూల్చి నేల మట్టం చేసారని, దీని కారణంగా పూర్వీకుల సమాధులను కోల్పోవటంతో పాటు చనిపోయిన ముస్లింలను ఎక్కడ ఖననం చెయ్యాలో అర్ధం కాక ఆగమ్య గోచరంలో ముస్లింలు వున్నారని కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలు మస్జీద్‌ల అధ్యక్షులు నసీర్ ఖాన్, రహ్మత్, జానీపాషా, అమీర్, అన్వర్, సలాం, హుస్సేన్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.