Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యుత్ ఉత్పత్తికి కేంద్రమైన కొత్తగూడెంలో 132/33 కేవి సబ్ స్టేషన్ నిర్మించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్ కోరారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి భజన మందిరం రోడ్డులోగల డివిజనల్ కార్యాలయ డివిజనల్ ఇంజినీర్ విజరుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో 132/33 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ లేకపోవడం వలన సీతారాంపట్నం నుంచి వచ్చే విద్యుత్ సరఫరాలో ఏదైనా అంతరాయం తలెత్తితే పునరుద్ధరణకు దాదాపు 2గంటల సమయం పడుతుందని తెలిపారు. కొత్తగూడెంలో 132/33కేవి సబ్ స్టేషన్ నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నపటికీ పాలకుల నిర్లక్ష్యం మూలంగా కార్యాచరణకు నోచుకోవడం లేదని విమర్శించారు. చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో తరచు ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయన్ని నివారించాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్దయెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్లకొండ శరత్, వంగా రవిశంకర్, వంశీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.