Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
క్షణికావేశంలో భార్యపై కట్టుకున్న భర్త దాడి చేయడంతో భార్య చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కొత్తగూడెం పట్టణం మున్సిపల్ పరిధిలోని బూడిదగడ్డ ప్రాంతం, గౌతమ్ నగర్లో నివాసం ఉంటున్న నతరి శ్రీనివాస్, భార్య మంజుల (35) నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ సింగరేణిలోని డీఎల్ఆర్ ప్రయివేటు కంపెనీలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. మంజుల కూడా సింగరేణిలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పని చేస్తున్నారు. గత కొంతకాలంగా శ్రీనివాస్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గతంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఘర్షణ సమయంలో నడిరోడ్డుపై రాయితో బలంగా మోదాడు. తలను రోడ్డు కేసి కొడుతూ దాడి చేశాడు. తలకు బలమైన గాయమై, తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.