Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
హిజాబ్‌ను రాజకీయం చేసి ముస్లిం మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ఆరెస్సెస్, బీజేపీ చర్యలను ఖండించాలని ఆవాజ్ జిల్లా కమిటీ కోరింది. చర్యలను నిరసిస్తూ ఇల్లందులో శుక్రవారం ఆవాజ్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడారు. కర్ణాటకలో ముస్లిం మహిళలకు వ్యక్తి గత అంశం హిజాబ్‌ను రాజకీయం చేసి వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవరిస్తున్న ఆరెస్సెస్, బీజేపీ అల్లరి మూకలు చేస్తున్న హింసాయుత సంఘటనలు దారుణమన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ముస్లిం మహిళల హిజాబ్‌లో జోక్యాన్ని నిలువరించలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఖాదర్, జాఫర్, కుద్దూస్, అక్తర్, అసిఫ్, ఇర్షాద్, ఇమ్రాన్, ఫయాజ్, సలీం, జాఫర్, అబ్బాస్, సుభాని, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డ్స్‌తో ఎన్డీ, ప్రజాసంఘాల నిరసన
గత నెల రోజులుగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతోందని న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. కొత్త బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ప్లకార్డ్స్‌తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ ఐఎఫ్టియూ జిల్లా కార్యదర్శి యాకూబ్ షావలి, అరుణోదయ రాష్ట్ర నాయకులు అజ్మీర్ బిచ్చ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు సావిత్రి, పీవైఎల్ నాయకులు భూక్యా శివ, పీడీయస్‌యూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బి.సాయి, ఎ.పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : ముస్లిం బాలికలు మహిళల పైన జరుగుతున్నటువంటి వివక్షకు నిరసిస్తూ వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, రానున్న రోజుల్లో వివక్ష ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ అనే సునీత మైన అంశం వివాదాస్పదమైందని, ముస్లిం మహిళల గౌరవానికి సంబంధించి, ఒక మతానికి సంబంధించి అంశం యావత్ దేశం మొత్తం చర్చనీయాంశమైన నిరసన గళాలు వినిపిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు పినపాక నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ల నాగమణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోనె రేణుక, మండల మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుగుణ, కొత్తగూడెం టౌన్ మహిళా కమిటీ శ్రీలక్ష్మీ, సుశీల, మండల మహిళా కాంగ్రెస్ కార్యదర్శి కళ్యాణి కొంగ, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.