Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్నా ఏటీడీఓ పోస్టులు ఆశ్రమ పాఠశాలల ప్రాధానోపాధ్యాయులకే ఇవ్వాలని టీబ్ల్యూటియు సంఘం కోరింది. ఆదివారం పాల్వంచలో జరిగిన సంఘం సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శలు బి.నందా, యన్.శంకర్ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని దమ్మపేట సమ్మక్క-సారక్క జాతర విధులు కేటాయించినందున ఆ పరిధిలోని ఆశ్రమ పాతశాలల ప్రాధానోపాధ్యాయులకే ఇన్చార్జి ఇవ్వాలని అన్నారు. భద్రాచలం ఎటిడిఓ పోస్టు ఖాళీ అయితే అక్కడి ప్రాధానోపాధ్యాయుడికి ఇంచార్జ్ ఇచ్చారని ఆ విధానం దమ్మపేట పరిధిలో ఎందుకు ఉండదని ప్రశ్నించారు. ప్రాధానోపాధ్యాయుడికి కాకుండా వార్డెన్‌కి ఇవ్వదాన్ని తప్పు పట్టారు. ఒకే శాఖలో ఇంత వ్యత్యాస భేదాభిప్రాయాలు ఎందుకో అధికారులు చెప్పాలన్నారు. శాఖ అంతటా ఒకే న్యాయాన్ని పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి.జయ, బి.భావసింగ్, వి.బలరాం, యమ్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.