Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని నిరుపేద బ్రాహ్మణులకు ప్రతినెల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందచేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్లోని సాయిబాబా భజన మందిరంలో 15 పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రామాయణ పారాయణ సేవా సమితి, కేశిరాజు లక్ష్మీనారాయణ, కురుచేటి రామచంద్ర మూర్తి, ఉప్పల శారద, సీతా jఔష్ణ మీనన్ తదితరుల సహకారంతో ఈ వితరణ అందజేశారు. వచ్చే నెల నుండి అమెరికాలో ఉన్న తమ మనుమరాళ్ళ పేరుమీద ఇంకో రెండు కుటుంబాలను దత్తత తీసుకోనున్నట్లు ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గా ప్రసాద్ దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమానికి చేయూత ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు. భద్రాచలంలోని నిరుపేద బ్రాహ్మణ కుటుం బాలను గుర్తించిహ, వారిని శాశ్వతంగా దత్తత తీసుకుని ఈ సహాయం ప్రతినెలా అందించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాకాల లక్ష్మి, సీనియర్ పాత్రికేయులు కోన ఆనంద్ కుమార్ శర్మ, సాయిబాబా భజన మందిరం ఆర్.కె.రామారావు, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్, అడ్వకేట్ తిరుమల రావు, కొవ్వూరి సంతోష్, విశ్వ నాధ్ తదితరులు పాల్గొన్నారు.