Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి కె.సంధ్యారాణి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల పరిధిలోని ప్రజల్లో ఎవరికైనా క్షయవ్యాధి లక్షణాలు ఉంటే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షలు నేటి నుంచి అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇల్లందు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ కె.సంధ్యారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. క్షయ వ్యాధి పరీక్షల నిమిత్తం అత్యంత ఆధునికమైన ట్రునాట్ పరికరం ఆసుపత్రిలో అందుబాటులో ఉందని తెలిపారు.