Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐటీసీ పీఎస్ పీడీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మొహంతి
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని గ్రామాల్లో సమగ్ర, సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మొహంతి తెలిపారు. మండలంలోని ఇరవెండి పంచాయతీ పరిధిలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయ సన్నిధిలో రూ.60 లక్షల ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని మోతె పట్టినగర్, కోయగూడెం పంచాయతీల్లో మురుగు కాలువల నిర్మాణాల పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని వివరించారు. ఇరవెండితో పాటు పలు గ్రామాల్లో బస్ షెల్టర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ఐటీసీ కృషి అభినందనీయమన్నారు. ఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తొలుత అధికారులు వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం తరఫున వల్లూరిపల్లి వంశీకృష్ణ అధికారులకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ హెచ్ ఆర్ డీజీఎం శ్యామ్ కిరణ్, సివిల్ హెచ్ఓడి రమేశ్ కుమార్, అడ్మిన్ అధికారి డి.చెంగల్రావు, జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాస రావు, ఎఎంసీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, స్థానిక సర్పంచ్ కొర్సా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.