Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఓట్లు అమ్ముకొని జీవితాలను మళ్లీ తాకట్టు పెట్టుకోవద్దని బీఎస్పీ రాష్ట్ర చీప్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండల పరిధిలో పెద్దతండాలోని వంశీకృష్ణ ఫంక్షన్ హాలో లో సంతు సేవాలాల్ జయంతిని ఆదివారం నిర్వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు నిజాయితీగా, నైతిక విలువలతో ఆత్మగౌరవంతో జీవించాలని సంతు సేవాలాల్ మహరాజ్ బోధించారని గుర్తుచేశారు. డా.బీఆర్ అంబేడ్కర్ రాజ్యాన్ని రచించకపోతే దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వారు ఇప్పటికీ దీన స్థితిలో సమాజానికి దూరంగా దుర్భర జీవితాన్ని గడిపేవారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేశారంటే మళ్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను దుర్భర జీవితాల్లోకి నెట్టివేయాలనే ఉద్దేశ్యం పాలకుల్లో ఉందని వివరించారు. బహుజన బిడ్డలంతా చదువుకొని ఉన్నత స్థితికి రావాలని కోరారు. గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమయిందని ప్రశ్నించారు. బహుజన బిడ్డలు చదువుకునే ఉస్మానియా, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో అచార్యుల పోస్టులు మొత్తం ఖాళీగా ఉంచి, అగ్రవర్గాలు, దోపిడీ వర్గాల వారి బిడ్డల కోసం ప్రయివేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. మన చేతుల్లో ఉన్న అసైన్ మెంట్, పోడు భూములను లాక్కొని భూ దందాలు, భూ కబ్జాలు చేస్తున్న వారికి అప్పనంగా అప్పజెప్పేందుకు సిద్ధం అవుతున్నడన్నాడు. మన ఓట్లు మనమే వేసుకొని బహుజన రాజ్యం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.