Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ సమావేశంలో ఖమ్మం జిల్లాకు చెందిన సామాజిక సేవకుడు జిల్లా తెరాస నాయకుడు మేడా విజరు కుమార్‌ని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ప్రముఖ విద్యావేత్త తెలంగాణ రాష్ట్ర నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షులు వలూవాయి ఉషా కిరణ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మేడా విజరు కుమార్ మాట్లాడుతూ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని రాబోయే రోజుల్లో జిల్లాలో ప్రతి మండలాల్లో గ్రామాలలో కమిటీలు వేసి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్‌ని విస్తృతంగా ముందుకు తీసుకుపోవడం కోసం నావంతుగా కృషి చేయడంలో భాగంగా ముందు ఉంటానని నా మీద ఎంతో నమ్మకంతో ఈ యొక్క బాధ్యత అప్పగించిన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబుకి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ వ్యవస్తాపకులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మానుపాటి నవీన్‌కి తెలంగాణ రాష్ట్ర నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షులు వలూవాయి ఉషాకిరణ్ కి మేడా విజరు కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.