Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పోలీస్ స్టేషన్లో భట్టి ఫిర్యాదు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
దేశ సంస్కృతికి విరుద్ధంగా కాంగ్రెస్ నేత పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఖండిస్తుందని వెంటనే అతనిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించాలని మధిర శాసన సభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బిజెపి అధిష్టానం మెప్పు కోసం అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీలో ఎదిగి బిజెపికి అమ్ముడుపోయిన హేమంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.హేమంత్ వ్యాఖ్యల నేపథ్యంలో మోడీ బిజెపి నేతలు దేశానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండారు నరసింహారావు, తల్లపురెడ్డి నాగిరెడ్డి, కడియం శ్రీనివాసరావు, రాజీవ్ గాంధీ, తదితరులు పాల్గొన్నారు.