Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ పథకాల పంపిణీకి గైర్హాజరైన ఎంపీపీ
అ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా
నవతెలంగాణ-చండ్రుగొండ
ప్రభుత్వ పథకాలైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి గౌర్హాజరైన ఎంపీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై నిందలు వేయడం తగదని టీిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. ఆదివారం వారి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. అధికారులు ఎంపీపీని ఆహ్వానించినప్పటికీ కార్యక్రమంలో పాల్గొనకుండా ప్రోటోకాల్ పాటించటలేదని ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పార్టీ అంటే కుటుంబం ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎస్.కె రసూల్, తిప్పనపల్లి ఎంపీటీసీ లంక విజయలక్ష్మి, రావికంపాడు ఎంపీటీసీ భూక్య రాజి, చండ్రుగొండ సర్పంచ్ మలిపెద్ది లక్ష్మీ భవాని, బెండలపాడు సర్పంచ్ వెంక టేశ్వర్లు, ఉప సర్పంచ్ బాలు, బీసీ సెల్ నాయకులు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.