Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ జెడ్పీటీసీ విజరు గాంధీతో సహా
60 మంది ప్రజా ప్రతినిధులు
అ రానున్నది కాంగ్రెస్ రాజ్యమే : రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-బూర్గంపాడు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ బట్టా విజరు గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం గాంధీ భవన్లో విజరు గాంధీకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే క్రమంలో బట్టా విజరు గాంధీతో పాటు అధికార పార్టీకి చెందిన ఐదుగురు సర్పంచులు, ఐదుగురు ఉప సర్పంచ్లు 50 మంది వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలోని మేజరు పంచాయతీలను క్లీన్ స్వీప్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్లు చేర్పా వెంకటేశ్వర్లు (నకిరిపేట), కుంజా చిన్నాబ్బారు (వేపలగడ్డ), పాయం వెంకటేశ్వర్లు (ఉప్పుసాక), కొడిమే వెంకటేశ్వర్లు (కృష్ణాసాగర్), తాటి వీరాంజనేయులు (సొంపల్లి), ఉప సర్పంచ్లు వార్సా వెంకటేశ్వర్లు (వేపలగడ్డ), తాటి గోవిందమ్మ (ఉప్పుసాక), పొందే గోవిందా (కృష్ణాసాగర్), పెంకే సంతోష్ కుమార్ (సొంపల్లి), బొర్రా శ్రీను (మాజీ సర్పంచ్ మొరంపల్లి బంజర), తుమ్మల పున్నమ్మ (మాజీ ఎంపీటీసీ మొరంపల్లి బంజర), భూక్యా మంజు (ఉప్పూసాక మాజీ సర్పంచ్)లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రాజ్యం కాంగ్రెస్ రాజ్యం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళల అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం స్థాపన తథ్యం ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రులు రేణుక చౌదరి, పోరిక బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భజన సతీష్, గాదె కేశవ్ రెడ్డి, గోపి, సుధాకర్ రెడ్డి, వేణు, నరసయ్య, బొర్రా శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.