Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మహా అన్నదాన సత్రం ప్రారంభం
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
హరి హర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివాలయం పునర్ నిర్మాణ వ్యవస్థపకులు మారగని శ్రీనివాసరావు మండల కేంద్రంలో అంకమ్మ తల్లి గుడి వద్ద రూ.30 లక్షలతో మహా అన్నదాన సత్రాన్ని నిర్మించారు. ఈ సత్రన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్న అన్నదానం మహా గొప్ప అని అలాంటి అన్నదానం చేయడానికి ఇంత ఖర్చుతో మారగాని శ్రీనివాసరావు కృషితో నిర్మించడం చాలా సంతోషం అని అన్నారు. అదేవిధంగా శివాలయంలో వారంలో ఒక రోజు అన్నదానం చేయడం అదేవిధంగా అంకమ్మ గుడి దగ్గర ఇలాంటి సత్రం నిర్మించడం మరో పక్క బాలాజీ వెంకటేశ్వర స్వామి, దేవాలయం పెద్దమ్మ తల్లి గుడి వుండటం పల్లె వాతావరణంలో ఆధ్యాత్మి కతతో రైతులు భక్తులు ఎంతో అనందంగా వుంటా రని అన్నారు. మారాగాని శ్రీనివాసరావు లాంటి వ్యక్తు లు మండలంలో ఎంతో అవ సరం అని అలాంటి వారికి గ్రామ మం డల ప్రజలు సహాయ సహకారాలు ఎప్పు డు వుండాలని అన్నారు. తుమ్మల దగ్గర వుండి అన్న దాన కార్యక్ర మాన్ని ప్రారం భించి భక్తులకు అన్నదానం చేశారు. అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్ఛా నాగేశ్వరావు, జిల్లా పరిషత్ ఛైర్మెన్ కొరం కనకయ్య, మాజీ శాసన సభ్యు లు తాటి వెంకటేశ్వర్లు, ఎంపీ టీసీ కృష్ణారెడ్డి, చండ్రుగొండ జడ్పీటిసి వెంకటరెడ్డి, భారత రాంబాబు పాల్గొన్నారు.