Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ మున్సిపల్ పరిధిలోని శ్రీనివాసకాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ అధికారులు కోరారు. ఈ మేరకు ఆదివారం యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు యమ్మల భానుతేజను కలిసి కాలనీలో పర్యటిం చారు. ఈ కాలనీలో ప్రధానంగా రోడ్లు డ్రైనేజీలు, వీధిలైట్ల సమస్యలు ప్రజలు ఎదుర్కొంటు న్నారని సర్సరీకి వెళ్లే మార్గంలో రోడ్లు పై సొరంగంలా ఏర్పడిందని తక్షణమే అధికారులు సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మున్సి పాలిటీ అధికారులకు నిధులు ఉన్నా వాటిని సద్విని యోగం ఎందుకు చేయడం లేదని అధికారులను ప్రశించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో మైనార్టీ పట్టణాద్యక్షులు చాంద్‌పాషా, కాపా శ్రీనివాసరావు, ఇస్లావత్ రాజు, వెంకటాచారి, రేవతి, కళ్యాణి, ఎస్కె హసీనా, వెంకన్న, శ్రీనివాసు, కృష్ణవేణి, భారతమ్మ, మల్లేశ్వరి పాల్గొన్నారు.