Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం బస్టాండ్ నుంచి మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే వారికోసం ఆర్టీసీ వారు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేశారని, సురక్షితంగా జాతరకు వెళ్లిరావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం బస్టాండ్లో మేడారం సమ్మక్క-సారక్క జాతర కోసం ఏర్పాటు చేసిన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ సమ్మక్క-సారక్క జాతరకు ఆర్టీసీ ప్రయాణిం అతి తక్కువ ధరలతో ప్రజలకు గమ్యస్థానం చేర్చడానికి కొత్తగూడెం బస్టాండ్ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి జాతరకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా బస్సులో ఉన్న ప్రయాణికులను కలిసి వారితో ముచ్చటించారు. అనంతరం ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, డిపో మేనేజర్ జి.వెంకటే శ్వరబాబు, ఉర్దూ ఘర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, ఆర్బన్ హెల్త్ ఆర్గనైజర్ పొన్నెకంటి సంజీవరాజు, ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
కొన్ని గ్రామాలకు బస్సులు రద్దు....
మేడారం మహా జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నందున సోమవారం 14వ తేదీ నుండి 19వ తేదీ శనివారం వరకు కోన్ని రూట్లు, గ్రామాలకు బస్సు సర్వీసులు తాత్కాలికముగా రద్దు చేసినట్లు బిపో డిపో మేనేజర్ జి.వెంకటేశ్వరబాబు తెలిపారు. ఇందులో బంగారుచలక, జగన్నాదపురం, పాపకొల్లు, కాకర్ల, తుంగారం, అన్నపురెడ్డిపల్లి వయా ఎర్రగుంట, పెంట్లం, అన్నపురెడ్డిపల్లి వయా చండ్రుగొండ, మర్రిగూడెం, ఐటిఐ కాలేజీ, సింగభుపాలెం రద్దుచేశా మని, మర్కోడు, గుండాల, ఖమ్మం, ఇల్లెందు రూట్లలో ట్రిప్పుల సంఖ్య తగ్గించామని తెలిపారు. కావున ప్రయాణీకులు గమనించాలని సూచించారు.