Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలో నేడు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటనను విజయవంతం చేయాలని బూర్గంపాడు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్లు పేర్కొన్నారు. ఆదివారం బూర్గంపాడులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం మధ్యాహ్న 1:30 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో 104 మంది పేదింటి ఆడప డుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కలదని వారు పేర్కొన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు.