Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఎస్డబ్ల్యూఆర్ఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-పాల్వంచ
నేటి జీవన విధానంలో ఒత్తిడిని తట్టుకోవడానికి క్రీడల అవసరం చాలా ఉందని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల బాలుర ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం స్థానిక సాంఘీక సంక్షేమ గురుకులపాఠశాల కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న స్పోర్ట్స్ అకాడమీలో కాలీగా ఉన్న సీట్లను పూర్తి చేయడానికి సెకండ్ లెవెల్ స్పోర్ట్స్ బార్సు అండర్ 14 నిర్వహించారు. జిల్లా ప్రాంతీయ క్రీడల సమన్వయ అధికారి వై.వీరస్వామి ఆధ్వర్యంలో ఈక్రీడల్లో 112 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆటలద్వారా ఉల్లాసంతోపాటు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని విద్యార్ధి ఏదో ఒక ఆటలో నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లకిëదేవిపల్లి సర్పంచ్ విజరు, ఉపసర్పంచ్ శేఖర్, ప్రసాద్, కృష్ణ, ఉదరు, సంజరు, రాంబాబు, కరుణాకర్, మురళి, పేరెంట్స్ కమిటీ అద్యక్షులు పండుగ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.