Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ కర్నాటి
నవతెంగాణ-కొత్తగూడెం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తెలియచేసిన సమస్యలను నమోదు చేసినట్లు చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను అధికారులకు సిఫారసు చేస్తున్నామని పరిష్కార స్వభావంపై నివేదికలు అందచేయాలన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, ఆర్డీఓ స్వర్ణలత, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.