Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని కొత్త ఎర్రబోయినపల్లి గ్రామంలో గత 30 సంవత్సరాలుగా దళిత వాడలో నడవడానికి రోడ్లు లేక వాడ ప్రజలు నానా తంటాలు పడుతున్నా విషయం పాఠకులకు విదితమే. ప్రస్తుత గ్రామ సర్పంచ్ సింగిశాల పద్మా- ప్రసాద్ ఈ విషయమై సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య దష్టికి తీసుకెళ్లారు స్పందించిన ఎమ్మెల్యే కొత్త ఎర్రబోయినపల్లి దళిత వాడలకు పాత ఎర్రబోయినపల్లి గ్రామానికి ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో సుమారుగా 15 లక్షలు ఎమ్మెల్యే కోటాలో ఐదు లక్షలు మొత్తము 20 లక్షలు ఆ గ్రామానికి మంజూరు చేసారు. సోమవారం సర్పంచ్ పద్మా- ప్రసాద్ సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామ సమస్యే ఏది అయినా అది నా సమస్య అని ఆమె తెలిపారు. 30 సంవత్సరాల నుండి కూడా ఇబ్బందులు పడుతున్న ప్రజల ఆశలు చిగురించాయని ఎమ్మెల్యే సండ్రకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేను ఉన్నంతవరకు గ్రామ అభివృద్ధి కోసమే శ్రమిస్తానని తన ఆశా భావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామ పెద్దలు విరివిగా పాల్గొన్నారు.