Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అమోదించిదే లేదని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసొసియేషన్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. ఈ బిల్లు రైతులు, ఉద్యోగు లు, ప్రజా వ్యతిరేక బిల్లు అన్నారు. ఈ బిల్లును తెలంగాణ అసెంబ్లీ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిం దన్నారు. ఈ విషయంలో విద్యుత్ ఉద్యోగులు అంతా ప్రభుత్వంకు అండగా ఉం డాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఇంజనీర్స్ అసొసి యేషన్ నాయకులు చాట్ల శ్రీనివాస్ రావు, సమీర్, భీమ్య, జాదవ్, రవి, విజ రు, నారాయణ, వేణు, మురళి కృష్ణ పాల్గొన్నారు.