Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ శ్రేణులకు రేగా పిలుపు
నవతెలంగాణ-ములకలపల్లి
తెలంగాణ అభివృద్ధి ప్రధాత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం దమ్మపేట మండలం నాచారంలో ప్రతిష్ఠా కార్యక్రమానికి విచ్చేసిన ఆయన తిరుగు ప్రయాణంలో మండల కేంద్రమైన ములకలపల్లిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుని హౌదాలో అడుగుపెట్టడంతో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు ఆధ్వర్యంలో నాయకులు, ప్రజాప్రతినిధులు దేగాను శాలువాతో సత్కరించారు. అనంతరం రేగా మాట్లాడారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజులపాటు సంబరంగా జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలన్నారు. 15న జిల్లా, అన్ని మండల కేంద్రాల్లోని ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాల్లో అన్నదానం, పండ్లు, దుస్తులు పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని, 16న రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, 17న జిల్లా వ్యాప్తంగా మండలాల్లో సర్వమత ప్రార్ధనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శనగపాటి అంజి, సర్పంచు కారం సుధీర్, సున్నం సుధాకర్, కీసరి శ్రీను, నాయకులు పుష్పాల చందర్రావు, మంగపతి, వెంకటేశ్వర్లు, కొమరయ్య, రాజారావు, గోపాల్, ప్రవీణ్, కృష్ణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.