Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
కల్యాణ పురం గ్రామపంచాయతీ పరిధిలోని రాయినిపేట వలస ఆదివాసీ గుంపులో తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు పాయం నరసింహారావు అన్నారు. సోమవారం ఆయన ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఆదివాసీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు లేక వీరు పడుతున్న అవస్థలు బాధగా ఉన్నాయన్నారు. గ్రామ సమీపంలోని ఎండిపోయిన వాగులో చెలిమేలు తీసుకుని కలుషితమైన నీటినే వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ గ్రామానికి రోడ్, విద్యుత్ సౌకర్యం లేక ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఆదివాసీ గ్రా మాలకు ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు కలిపించాలని డిమాండ్ చేశారు. ఆయ న వెంట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాస రావు ఉన్నారు.