Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల పరిధిలోని ప్రజలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 108 వాహన సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అసిస్టెంట్ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వద్ద ఆయన 108 వాహనాన్ని తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతినెలా జిల్లాలో ఉన్న అన్ని 108 వాహనాలను పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. అందులో భాగంగానే నేడు మండల కేంద్రములో 108 వాహనం కండిషన్ ఎలా ఉందో పరిశీలించామని చెప్పారు. అలాగే వాహన సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని, వాహన కండిషన్ పై వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వాహనం మరమ్మతులకు గురైన సమయాల్లో సంబంధిత వివరాలను అడిగి తెలుసుకొని వెంటనే మరమ్మతులు చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు పైలెట్ పరమ సునీల్ కుమార్,ఈఎంటీ సరోజిని పాల్గొన్నారు.