Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కండ్లకు గంతలు కట్టుకొని వ్యకాస వినూత్న నిరసన
నవతెలంగాణ-సుజాతనగర్
కంగాల బుచ్చయ్య నగర్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకొని ఖాళీ బిందెలతో మండల పరిషత్ కార్యాలయం ముందు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ మాట్లాడుతూ గత ఏడాది నుండి అంజనాపురం గ్రామపంచాయతీ పరిధిలోనీ గ్రామకంఠం భూమిలో ఆదివాసీ గిరిజనులు గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే వీరికి తాగు నీరు, విద్యుత్ రహదారులు కల్పించాలని అనేకమార్లు పంచాయతీ అధికారులకు తెలిపినా స్పందించలేదని అన్నారు. ఇకనైనా అధికారులు కలగజేసుకుని వీరికి తక్షణమే వసతులు కల్పించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కే.తిరుపతిరావు, నాగరత్నమ్మ, నాగమణి, కళావతి, నవీన్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.