Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గత రెండు రోజుల క్రితం లచ్చిగూడెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కారం నర్సింహారావు కుటుంబాన్ని అన్ని విదాలా ఆదుకుంటామని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు అన్నారు. సోమవారం లచ్చిగూడెం గ్రామం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన అగ్నిభాదిత కుటుంబానికి రూ.3 వేలు నగదుతో పాటు బియ్యం, నిత్యవసరాలు, వంట సామాగ్రిని ఆయన చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వం రావాల్సిన తక్షణ సహాయంతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు అందేలా చూస్తానని భాదిత కుటుంబానికి ఆయన భరోసా కల్పించారు. ఆయన వెంట పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, అధికార ప్రతినిధి యండి జానీపాషా, లచ్చిగూడెం సర్పంచ్ ఇర్పా చంటి, ఉపాద్యక్షులు అపకా వీర్రాజు, గ్రామస్తులు చిన్నయ్య, రాముడు, మల్లేష్, రాకేష్, గణేష్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.