Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గిరిజన యూనివర్సిటీని
భద్రాచలం కేంద్రంగా ఏర్పాటు చేయాలి
అ మాజీ ఎంపీ మిడియం బాబూరావు
నవతెలంగాణ-భద్రాచలం
కేంద్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చర్చించాల్సిన అంశాలలో భద్రాచలం ఐదు గ్రామ పంచాయతీల సమస్యను కూడా చేర్చాలని దీనికి ఒక పరిష్కారం చూపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నాయకులు, భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఫిబ్రవరి 17న సమావేశం కానున్న నేపథ్యంలో విభజన సమయంలో భద్రాచలం ప్రాంతంనకు జరిగిన అన్యాయంపై చర్చ చేయాలని, ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంను కమిటీ ముందు ఉంచే విధంగా చొరవ చూపాలని అన్నారు. పార్టీ పట్టణ కమిటీ చేపట్టిన భారత ప్రధానికి పదివేల పోస్టుకార్డుల ఉద్యమంలో సోమవారం ఆయన పాల్గొని పట్టణంలోని ప్రముఖులు, డాక్టర్ల వద్ద పోస్టు కార్డుల క్యాంపెయిన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన హామీలలో భాగంగా గిరిజన యూనివర్సిటీని భద్రాచలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బీ.నరసా రెడ్డి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు, పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.