Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్ల : ఇటీవల జరిగిన నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడిసిన్ సీట్లు సంపాదించిన గోరంట్ల ధన్యశ్రీ తండ్రి వెంకటేశ్వరరావు, తోటపల్లి ఆశ్లేష తండ్రి తోటపల్లి శ్రీనివాసరావులకు శాఖా గ్రంధాలయం-చర్ల నందు దొడ్డి తాతారావు ఎస్టీ అజీజ్, తడికల లాలయ్య, ఉపాధ్యాయులు బత్తుల శ్రీనివాసరావు, సిహెచ్ రామమోహనరావు నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నందు దొడ్డి తాతారావు మాట్లాడుతూ విద్యార్థులను తల్లిదండ్రులను అభినందిస్తూ నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేద కుటుంబాల విద్యార్థినులు డాక్టర్ సీటు సంపాదించడం చాలా గొప్ప విశేషమని, చదువుకి పేద-గొప్ప తారతమ్యం ఉండదని, డాక్టర్ వృత్తిని పొంది ఈ చర్లకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.