Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-బూర్గంపాడు
రాష్ట్రంలో నిరుపేద కుటుంబాల్లోని ఆడ బిడ్డలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో తహశీల్దార్ భగవాన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 108 మంది లబ్ధిదారులకు రూ.1,08,12528 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మతాల భేదం లేకుండా అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఆయన అన్నారు. అనంతరం బూర్గంపాడు సర్పంచ్ సిరిపురపు స్వప్న భర్త సిరిపురపు ప్రసాద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆయన నివాసానికి వెళ్లి రేగా పరామర్శించారు. అదేవిధంగా నాయకులు మందా ప్రసాద్ సతీమణి మందా భూవన ఇటీవల ప్రమాదంలో గాయపడగా ఆమెను కూడా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వివేక్ రామ్, బూర్గంపాడు జడ్బీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల మహిళా అధ్యక్షు రాలు ఎల్లంకి లలిత, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం ఆగదీష్, మండల కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.