Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘట్టాలు సమాజం ఉన్నంత వరకూ మర్చిపోలేని నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గెరిల్లా యోధుడు మేదరమెట్ల మట్టయ్య కుమార్తె భాగం శరయ్య సోదరి నల్లమల్ల నిర్మల తెలిపారు. గోవిందాపురం ఏ గ్రామంలో సోమవారం జరిగిన శరయ్య సంతాప సభలో ఆమె పాల్గొన్నారు. ఆనాటి ఘట్టాలను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావులకు ఆమె వివరించారు. నిర్మల కుటుంబానికి నున్నా నాగేశ్వరరావు, భాగం హేమంతరావు బంధువులు. శరయ్య చిత్ర పటానికి వారు పూలమాలలేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో ఆమె మాట్లాడుతూ.. భాగం శరయ్యను మీ బావ అడ్రస్ చెప్పాలని నిజాం సైన్యం తీవ్ర వేధింపులకు నిర్బంధాలకు గురిచేసినా సమాచారం చెప్పలేదని ఆమె వారికి వివరించారు. ఆ పోరాట ఘట్టాలను తాను స్వయంగా తన భర్తతో కలిసి చుచానని తెలిపారు. నిజాం సైన్యం, నెహ్రూ సైన్యం తెలంగాణ పోరాట యోధులు కుటుంబాలను దళాల సమాచారం కోసం తీవ్ర నిర్బంధాలకు గురిచేసిందని, అయినా ఆ కుటుంబాలు పోరాటయోధుల సమాచారం చెప్పలేదన్నారు. తన భర్త సమాచారం చెప్పాలని తనను అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశారని అయినా తాను ఆ నిర్బంధాలు వేధింపులు భరించానే తప్ప సమాచారం చెప్పలేదన్నారు. అంతటి క్రమశిక్షణ, పోరాట స్ఫూర్తి నేడు కరువైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజల కోసం పని చేయాలని వారికి ఆమె సూచించారు.
దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసమే తెలంగాణ సాయుధ పోరాటం సాగింది : నున్నా, పొన్నం
దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసమే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దళాలకు శరయ్య సమాచారం, భోజనాలు అందించేవాడు అన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది తమ అసువులు అర్పించారని, వారి త్యాగాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమస్యల పరిష్కారం కోసం పోరాటం లోకి రావాలని కోరారు. నైజాం సైన్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తొమ్మిదిమందిని నిర్బంధించి గోవిందా పురం గ్రామము తీసుకువచ్చి ఏడుగురుని కాల్చి చంపారని ఇద్దరిని విడిచి పెట్టారని తెలిపారు. ఆ ఇద్దరిలో గోవిందపురం ఎల్ చెందిన కొత్తపల్లి కృష్ణమూర్తి, భాగం శరయ్య అని తెలిపారు. ఈ పోరాటంలో పేద ప్రజలకు పది లక్షల ఎకరాలు పంచి పెట్టారని, సుమారు ఐదు వేల మందికి పైగా తమ ప్రాణాలు అర్పించారని అన్నారు.
పెట్టుబడిదారులకు ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెడుతున్నారు : సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడుతూ పెట్టుబడుదారులకు కట్టబెడు తున్నారు. బీజేపీ పాలనలో రాజకీయ విలువలు దిగజారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నియంత పాలన కొనసాగుతుందని విమర్శించారు. శరయ్య లాంటి వ్యక్తులు లేకుండా పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంతాప సభలో దొండపాటి నాగేశ్వరరావు, ఏంగల ఆనందరావు, ఆళ్లపాడు, గోవిందపురం ఏ గ్రామాల సర్పంచులు మర్రి తిరుపతిరావు, భాగం శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తోట రామాంజనేయులు తూము రోషన్ కుమార్ నల్లమల్ల నిర్మల శరయ్య కుటుంబ సభ్యులు కళ్యాణం వీరభద్రరావు, మేదరమెట్ల నాగేశ్వరరావు సిపిఎం నాయకులు షేక్ ఖాసిం మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు భాగం రమేష్ మోటమర్రి సొసైటీ ఉపాధ్యక్షుడు కావూరి శంకర్రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.