Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరు గంటల పనితో గిట్టుబాటు : డీఆర్డీవో పీడీ
నవతెలంగాణ-కారేపల్లి
ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిర్చి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా రైతులు గిట్టుబాటు ధర పొందాలని డీఆర్డీవో పీడీ విద్యాచందన కోరారు. సోమవారం కారేపల్లి మండలంలో పర్యటించారు. మాణిక్యారంలో ఏర్పాటు చేసిన ఐకేపీ మిర్చి కొనుగోలు కేంద్రాన్ని పీడీ పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులు రైతులను మిర్చిని కొనుగోలు చేసి వెంటనే తరలించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన మిర్చికి వెంటనే పైకం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాణిక్యారంలో నర్సరీని పరిశీలించిన పీడీ నాణ్యత ప్రమాణాలను పాటించి ప్లాస్టిక్ సంచుల్లో మొక్కలను పెంచాలన్నారు. సీతారాంపురంలో ఆర్అండ్బీ రోడ్‌కు ఇరువైపుల పూలమొక్కలను నాటాలని కార్యదర్శి ఉషకు సూచించారు. టేకులగూడెం పంచాయతీలో జరుగుతున్న ఉపాధీ హామీ పనులను ఆమె పరిశీలించి కూలీలలో మాట్లాడారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలు రోజుకు ఆరు గంటలు పని చేయటం ద్వారా గిట్టుబాటు కూలి పడుతుందన్నారు. కూలీలు పనులు అడగగానే పనులు కల్పించాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుజు జాబ్ కార్డులను అఫ్డేట్ చేయాలని, మార్చి నాటికి పూర్తి స్ధాయిలో ఈజీఎస్ పనులు చేయించాలన్నారు. పీడీ వెంట డీపీఎం శ్రీనివాస్, ఈసీ సుదీర్, ఐకేపీ సీసీలు తుమ్మలపల్లి అనిల్ పగడాల పుష్ప, షేక్ గౌసియా, రాజేశ్వరీ, కార్యదర్శులు నాగేంద్రబాబు, నగేష్, వీవోఏ భూక్యా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.