Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-కొణిజర్ల(ఏన్కూర్)
మండలంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడి చివరకు కమ్యూనిస్టుల జీవించిన మహా నాయకుడు అమరనేని కిషన్ రావు చిరస్థాయిగా ప్రజా ఉద్యమంలో ఉంటారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు అన్నారు. సోమవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభకు పార్టీ మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి పేదల పక్షాన ఎర్రజెండా నాయకత్వంతో కలిసి ప్రజలను సమీకరించి ఉద్యమాలకు నాయకత్వం వహించారని కొనియాడారు. అమరనేని కిషన్‌రావు మరణం ఉద్యమానికి తీరని లోటు అని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.నివాళులర్పించిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, బానోతు బాలాజీ, ఏర్పుల రాములు, ఇటుకల లెనిన్, ఎంపిటిసి సభ్యులు భూక్య లచ్చు నాయక్, సొసైటీ వైస్ చైర్మన్ రేగళ్ళ తిరుమలరావు, ఏన్కూర్ సిపిఎం గ్రామ కార్యదర్శి బుచ్చాల వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా నాయకులు అమరనేని వీరభద్రం, మండల కన్వీనర్ జాగర్లమూడి రంజిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మాలోతు రాందాస్ నాయక్, మండల అధ్యక్షులు స్వర్ణ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.