Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి హరీష్‌రావుకి సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితుల వినతి
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీరోలు గ్రామ రైతులు సోమవారం తెలంగాణ ప్రగతి భవనంలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కొరకు తిరుమలయాపాలెం మండల పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదని, సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారాన్ని రైతులకు అందించాలని మంత్రిని కోరారు. మండల ప్రాథమ ఆరోగ్య కేంద్రం 24గంటలు సౌకర్యం కల్పించాలని, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి బోడ మంగీలాల్, రైతులు కొత్తపల్లి వెంకటరెడ్డి, కొప్పుల శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల రాంరెడ్డి తదితరులు ఉన్నారు.