Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెవిపిఎస్ డైరీ ఆవిష్కరణ సభలో నందిపాటి మనోహర్
నవతెలంగాణ- ఖమ్మం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ .బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో కుల మతాంతర వివాహాలను ప్రోత్సహించడంతో పాటు ఆర్థిక అంతరాలు లేని నూతన భారతావనిని నిర్మించేందుకు పాటుపడాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు మాచర్ల భారతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎన్నెస్పీ క్యాంపులోని మంచికంటి భవనంలో సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన 2022 కెవిపిఎస్ డైరీని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి పెనుప్రమాదం ముంచుకొస్తున్నదని, మళ్ళీ మధ్యయుగాల కాలం నాటి దుర్మార్గపు అసమానతల వ్యవస్థలోకి బలవంతంగా తీసుకెళ్లడానికి మత ఛాందస వాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు అమలులో రాజకీయ జోక్యాన్ని నివారించి పారదర్శకంగా అమలు చేయాలని, ప్రతి పేద దళిత కుటంబానికి దళిత బంధు అందజేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు పాపిట్ల సత్యనారాయణ, గోపే వినరుకుమార్, పగిడికత్తుల నాగేశ్వరరావు, బొట్ల సాగర్, నందిగామ కృష్ణ, బండి రామ్మూర్తి, మట్టే దుర్గాప్రసాద్, మాచర్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.