Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండల పరధిలోని ముష్టిబండ గ్రామంలో మంగళవారం సీపీఐ(ఎం) నాయకులు అమరజీవి కామ్రేడ్ ఉడుతనేని వెంకట్రావు 30 వర్థంతిని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లకిëనారాయణ అధ్యక్షతన జరిగింది. తొలుత ఉడుతనేని స్మారక స్థూపం వద్ద పార్టీ పతాకాన్ని దమ్మపేట మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ఎగురవేశారు. చిత్రపటానికి పూలమాల ఉడుతనేని వెంకట్రావు చిన్న కుమార్తె విమలమ్మ వేశారు. అనంతరం జరిగిన వర్థంతి సభలో మోరంపూడి శ్రీనివాసరావు, దొడ్డాలకిëనారాయణ, సీనియర్ నాయకులు రావి శీతయ్యలు మాట్లాడారు. వక్తలు ఉడుతనేని వెంకట్రావు ఆనాడు జమీందార్లుకు వ్యతిరేకంగా రైతులు వ్యవసాయ కార్మికులు ఇతర పేదల కోసం వారి వారి సమస్యలపై మిలిటెంటు పోరాటాలు నిర్వహించారని పార్టీ ఎదుగుదలకు అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఈ సభలో ముష్టిబండ పార్టీ శాఖ కార్యదర్శి కొల్కిపోగు శ్రీనివాసరావు, కె.నాగేంద్రరావు, కె.లకిëనారాయణ, కె.లచ్చన్న, జగన్నాథ శ్రీను, చీకటి లకిëనారాయణ, గ్రామస్తులు చిట్యారావు, రాంబాబు, వెంకట్రావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.