Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బకాయిపడ్డ వ్యక్తి నుండి ఆటో స్వాధీనం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని నర్సాపురం గ్రామంలో దుమ్ముగూడెం డీసీసీబీ ఆధ్వర్యంలో మంగళవారం సిబ్బంది జప్తులు నిర్వహించారు. గ్రామానికి చెందిన కొత్త వెంకట్రావ్, డేగల శ్రీనులు 2017లో తీసుకున్న అప్పులు చెల్లించక పోవడంతో డిసిసిబి అధికారులు వారికి జప్తు నోటీసులు జారీ చేశారు. రికవరీ అధికారులు ముందుగా డేగల శ్రీను ఇంటికి వెళ్లి తీసుకున్న బకాయి చెల్లించాలని అడగగా శ్రీను వెంటనే తన వద్ద డబ్బులు లేవని తన వద్ద ఉన్న ఆటో తీసుకు వెళ్లండి అంటూ తాళాలు రికరవరీ అధికారులకు అందజేశాడు. దీంతో డిసిసిబి సిబ్బంది ఆటోను నర్సాపురం గ్రామంలో గల డిసిసిడి గోడౌన్లో భద్రపరిచారు. అనంతరం కొత్త శ్రీను ఇంటికి వెళ్లగా ఆ సమయంలో శ్రీను ఇంట్లో లేడు. దీంతో ఇంట్లో ఉన్న శ్రీను భార్యను, వాళ్ల అమ్మను చెల్లించాల్సిన బకాయి గురించి అడగడంతో పాటు ఇంటిని జప్తు చేస్తామంటూ ఇంట్లోకి వెళ్లి టీవి ప్లెగ్ తీసే విదంగా డిసిసిబి సిబ్బంది హడావుడి చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వెంకట్రావ్ గత ఏడాది క్రితం తాను వన్ టైం సెటిల్ మెంట్లో రూ.23 వేల 500 గాను రూ.19 వేల 500 కట్టాలని డిసిసిబి అధికారులు చెబితే రూ.15 వేల చెల్లించానని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో కొంత వివాదం సైతం చోటు చేసుకున్నట్లు సమాచారం. వెంకట్రావు మాత్రం డిసిసిబి అధికారులు దౌర్యన్యంగా తమ ఇంట్లోకి వచ్చారని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా వెంకట్రావుకు అధికారులు చెల్లించాల్సిన అప్పు గురించి వివరించి అతని నుండి రూ.6 వేలు రికవరీ చేశారు. బకాయిలు వసూలు చేయడానికి వెళ్లిన వారిలో ఏజిఎం చందర్రావు భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల డిసిసిబి బ్యాంకు మేనేజర్లు కొండలరావు, ప్రసన్నప్రియ, రేణుకలతో పాటు ఆయా కోపరేటివ్ బ్యాంకులకు చెందిన సిబ్బంది, సిఇఓ లు తదితరులు పాల్గొన్నారు.