Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు మంగళవారం పాల్వంచ మండల పార్టీ ఆధ్వర్యంలో వనమా నాయకత్వంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. లక్ష్మీదేవి పల్లిలోని యువసేన అనాధ ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమాన్నీ ఆయన ప్రారంభించారు. ఆశ్రమం ప్రాంగణంలో మొక్కలు నాటారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ కారణజన్ముడు, రైతు బాంధవుడని, పేదప్రజల బాగోగుల కోసం నిత్యం పరితపించే వ్యక్తి అన్నారు. సర్పంచ్ భూక్య విజరు, మండల పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీసీఎమ్ఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, రైతుసమన్వయ సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరరావు, ఎంపీపీ మడివి సరస్వతి, పెద్దమ్మతల్లి దేవస్థానం అధ్యక్షులు మహిపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కనకేశ్, పెద్దమ్మతల్లి దేవస్థానం డైరెక్టర్లు విజరు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.