Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జీవనోపాధి చూపించాలి
అ లేకపోతే కరకట్ట పనులను
అడ్డుకుంటాము : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-చర్ల
కోరేగడ్డ భూములు అమ్ముకొని కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ సీతమ్మధార రాజకీయాల వలన కలిగే నష్ట హరితహారం అందరికీ అంధే విధంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో కోరేగడ్డ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ సీతమ్మధారా ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా కోరేగడ్డ భూములు నీటమునిగి పోతున్నాయి. దాని వల్ల ఆ భూములను ఆధారం చేసుకుని బ్రతుకు జీవనం కొనసాగిస్తున్న వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందాన్నారు. వీరిని పాలకవర్గాలు, ప్రభుత్వం అధికారులు, పట్టించుకోకపోవడం సరైయిన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఈ కోరేగడ్డ భూములు రాక ముందు వీరి పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉండేది. ఈ కోరే గడ్డ భూమి పుణ్యమా అని ఇప్పుడు కొంత ఆర్ధికంగా నిలదొక్కుకొని సమాజంలో కొద్దిపాటి గౌరవంగా బతుకుతున్నారు. ఈ కూలీలకు ఈ కోరేగడ్డ తప్ప మరే ఇతర ఆదరం లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్‌లో ఈ క్రమంలో భూమి నీటమునిగితే ఈ నిరుపేదలకు జీవనోపాధి కనుమరుగు అవుతుందన్నారు. ప్రభుత్వం సర్వే చేసి ఈ వ్యవసాయ కూలీలకు, చిన్నకారు రైతులను గుర్తించి ప్రతి ఒక్కరికీ రూ.4 లక్షలు నష్టపరిహారం ఇచ్చి ప్రతి కుటుంబానికి జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ కోరేగడ్డ వ్యవసాయ కూలీలను ఏకం చేసి సీతమ్మధారా ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా మా ప్రాంతంలో నిర్మిస్తున్న కరకట్ట పనుల్ని అడ్డుకుంటామని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) లింగా పురం శకఖా నాయకులు పాముల సాంభ, రవీంద్ర, పంవన్, కూరేగడ్డ వ్యవసాయ కూలీలు పరవా రమేష్, కట్టఆ దినార ాయణ, వెంకన్న, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.