Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం క్రాస్ రోడ్లో, జనంపేట ప్రధాన రహదారి పైన మేడారం వెళ్ళే భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మంగళవారం ప్రారంభించారు. కేసీఆర్ జన్మదినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా హాస్పటల్లో రోగులకు తెరాస నాయకుల ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఎంపీఓ శ్రీనివాసరావు, సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.