Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
మండల కేంద్రమైన టేకులపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ సంవత్సరం జయంతి వేడుకలు ఘనంగా టేకులపల్లి, గోల్యా తండా గ్రామ పంచాయతీల్లో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. 2 పంచాయతీల్లో ఏర్పాటు చేసిన భోగ్ బండరోలలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పరంగా తహసీల్దార్ కె.వి.శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షల మంది బంజారులు ఉన్నారని అన్నారు. సోదర భావంతో కలిసిమెలిసి ఉండటంతోనే ప్రభుత్వము గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.కోటి నిధులు జయంతి వేడుకలకు మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ యార్డ్ చైర్మన్ బానోతు హరి సింగ్ నాయక్, ఎంపీపీ భూక్య రాధా, వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, టేకులపల్లి, గోల్యాతండా ఆలయాల అధ్యక్షులు ఇస్లావత్ నామ నాయక్, బోడా గన్నా నాయక్, భూక్య దల్ సింగ్ నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.