Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీజాపూర్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్ఘడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ప్రచారంలో భాగంగా, ఫిబ్రవరి 14 సోమవారం, కుట్రు పోలీస్ స్టేషన్ నుండి జవాన్లు పెట్రోలింగ్ చేసే క్రమంలో కేతుల్నార్ వైపు వెళుతుండగా ఈ సమయంలో 30 సంవత్సరాల వయస్సు గల మావోయిస్టు బుద్రు తాటి కేతుల్నార్ నుండి పట్టుబడ్డాడు. ఎస్పీ కమలలోచన్ కస్యప్ తెలిపిన వివరాల ప్రకారం పట్టుబడ్డ మావోయిస్టు విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడని 21.06.2017న పితుంపర కేతుల్నార్లో అసిస్టెంట్ కానిస్టేబుల్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో అరెస్టయిన మావోయిస్టు బుద్రు తాటి ప్రమేయం ఉందని తెలిపారు. అరెస్టయిన మావోయిస్టులపై కుట్రు పోలీస్ స్టేషన్లో శాశ్వత వారెంట్ కూడా పెండింగ్లో ఉందన్నారు. సదరు మావోయిస్టుపై న్యాయపరమైన విచారణ అనంతరం కుట్రు పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేసి జుడిషియల్ కస్టడీతో కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి జైలుకు తరలించామని ఎస్పీ వివరించారు.