Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీజేపీ ప్రభుత్వ ఒత్తిడితోనే
హిజాబ్‌పై నిషేదం విదింపు
అ బీజేపీ మతోన్మాద చర్యలు
ఉగ్రవాదానికంటే ప్రమాదకరం
అ విద్యార్థి, యువజన, మహిళా
ప్రజా సంఘాల జిల్లా స్థాయి సదస్సులో వక్తలు
నవతెలంగాణ-కొత్తగూడెం
భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కాలరాస్తోందని, విద్యాలయాల్లో విద్యార్ధుల మధ్య మత విద్దేశాలు రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దేశంలో అశాంతికి కారణమవుతున్నారని సదస్సులో పాల్గొన్న జమా-తే ఇస్లామి హింద్, ఐలూ, పిఓడబ్ల్యూ, రాష్ట్ర నాయకులు, అబ్దుల్ బాసిత్, రమేష్ కుమార్ మక్కడ్, చండ్ర అరుణ స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో హిజాబ్ వివాదంపై మంగళవారం విద్యార్థి, యువజన, మహిళ, ప్రజా సంఘాల, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సదస్సులో వక్తలు మాట్లాడారు. కేంద్రం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోనే కళాశాల యాజమాన్యం హిజాబ్‌పై నిషేదం విధించి వివాదాలకు ఆజ్యం పోశారన్నారు. అనాదిగా వస్తున్న ఆచార, వ్యవహారాలను కాలరాస్తూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంగిస్తూ హిజాబ్‌పై నిషేదం, ఆంక్షలు విధించారని, 73ఏండ్ల స్వాతంత్ర భారతంలో ఎప్పుడూ లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థి యువజన మహిళ ప్రజా సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫహీమ్ దాదా, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు పృద్వి ఎస్ఎఫ్ఐ కార్యదర్శి బి.వీరభద్రం, పిడిఎస్యు రాష్ట్ర నాయకురాలు మంజుల, ఎస్ఐఒ నాయకులు అబ్దుల్ సమద్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగుల్ మీరా, పీవైఎల్ రాష్ట్ర నాయకులు అజరు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా నాయకురాలు రత్నకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి సందకూరి లక్ష్మీ మాట్లాడుతూ సంస్కృతిక, సాంప్రదాయాలపై దాడి దేశ సమైఖ్యతకు, దేశ అభివృద్ధికి విఘాతమని, కుట్టుస్వామి కమిషన్ ఇచ్చిన తీర్పును, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 19ని కాలరాసే హక్కును కర్ణాటక ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ సదస్సులో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉపేందర్ హరీష్ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఖయ్యుం భూపేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు భూపేష్ నవీన్, పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి సంధ్య, ఎన్ఎఫ్ డబ్ల్యూ నాయకురాలు నిర్మల, విజయలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్.లక్ష్మి, అరుణోదయ నాయకులు అజ్మీర బిచ్చ తదితరులు పాల్గొన్నారు.