Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
తమతో పాటు సమాజంలో జీవిస్తున్న అందరిపట్ల ఆదరాబి óమానాలు పెంపొందించుకొని, ప్రతి ఒక్కరూ సమాజసేవ అలవర్చు కోవాలని ఐఎఫ్ఎఫ్సీవో కంపెనీ మార్కెటింగ్ అధికారి యం.నాగరాజు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బట్టి గూడెం ఆదివాసి గ్రామంలో నివసించే అత్యంత నిరుపేదలైన 50 మంది గిరిజనులకు రగ్గులు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. నిరుపేదల అవసరాలను తెలుసుకోని వారి అవసరాలను తీర్చడం మన అందరి బాధ్యత అని ఆయన తెలిపారు. సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ గ్రామాలలో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రూ.లక్షలు కూడ పెట్టినప్పటికీని దొరకని ఆనందం నిరుపేదలకు సహకారం అందించి నప్పుడు లభిస్తుందని ఆర్కే సీడ్స్ యాజమాన్యం పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఆర్కే సీడ్స్ నవీన్, గ్రామ పెద్దలు, పెద్ద ఎత్తున మహిళలు యువత పాల్గొన్నారు.