Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మున్సిపాలిటీ ఇన్చార్జ్ కమిషనర్‌గా మాధవిని నియమిస్తున్నట్లు కలెక్టర్ ఆదేశించారు. సోమవారం ఒక కమిషనర్, మరో కమిషనర్ ఉన్నత అధికారుల జాయినింగ్ ఆర్డర్ కాపీతో జాయిన్ కావడంతో ఇద్దరి మధ్యన వాదన చోటు చేసుకుంది. ఇరువురు, కమిషనర్లు అయిన వెంకటస్వామి, యథా స్థానానికి వెళ్లిపోవాలని, ప్రస్తుతం కమిషనర్ నాగప్రసాద్ రిలీవ్ చేసిన ప్రాంతానికి వెళ్లిపోవాలని మున్సిపల్ రీజీనల్ డైరెక్టరు ఆదేశించారు. ప్రస్తుతం అదే కార్యాలయంలో సీనీయర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మాధవిని కలెక్టరు ఆదేశాల మేరకు ఇన్చార్జ్ కమిషనర్‌గా నియమించారు.