Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మండల విద్యాశాఖ అధికారి
సత్యనారాయణ
నవతెలంగాణ-చండ్రుగొండ
చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లోని ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థినీ, విద్యార్థులకు స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్లు భర్తీ చేయడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వ్యాయామ ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. ప్రవేశాలు పొందిన బాలబాలికలకు దేహ దారుఢ్యం, శారీరక కొలతలను బట్టి ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలకు స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, 800 మీటర్ల లాంగ్ జంప్, ఫ్లెక్సిబుల్ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన వారి నుండి 10 మంది బాల బాలికలను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగే ఎన్నికలకు పంపడం జరుగుతుందని అన్నారు. రెండు మండలాల్లోని పీడీ, పీఈటీ, సీఎస్ టీచర్ల భాగస్వామ్యంతో 17న అన్నపురెడ్డిపల్లిలో 18న చండ్రుగొండ హైస్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. తుది జాబితాను 19న కొత్తగూడెం జిల్లా కేంద్రానికి పంపుతామని తెలిపారు. మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాల బాలికలు ఈ పోటీలలో పాల్గొనే విధంగా చొరవ చూపాలని కోరారు.