Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పోలీస్ స్టేషన్లో మహాజన సోషలిస్టు పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కమిటీల ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్‌పై భారత రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు దళితులకు దళిత సంఘాలు లేవని, దళిత సమాజాన్ని అవమానించినందుకు కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మంగళవారం భద్రాచలం పట్టణ సీఐ టి.స్వామికి వినతి పత్రం అందజేశారు. అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంఎస్పి కోఆర్డినేటర్ తోకల దుర్గ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ దేపంగి రమణయ్య, మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా పెరియార్ మాట్లాడారు. కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా నాయకులు కొప్పుల తిరుపతి మాదిగ, మండల సీనియర్ నాయకులు కొమ్మ గిరి వెంకటేశ్వర్లు మాదిగ, కోట ప్రభాకర్ మాదిగ, మండల నాయకులు దుర్గాప్రసాద్ మాదిగ, రవి కుమార్ మాదిగ, మాదిగ లాయర్లు ఫెడరేషన్ నాయకులు నాగరాజు మాదిగ పాల్గొన్నారు.