Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏఎస్పీకి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణం కేంద్రంగా వేరే ప్రాంతంకు చెందిన కొంతమంది కొన్ని కాలనీల్లో మత్తుపదార్ధాలను విక్రయిస్తూ కాలనీల్లో ఉండే యువకులను, విద్యార్థులను బానిసలుగా మార్చి వారిని అనారోగ్యపాలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసు కోవాలని భద్రాచలంకు చెందిన బ్లడ్ ఆర్గనైజర్స్ మురళి, గుమ్మడి రాజు, అంజిలు మంగళవారం భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ కువినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏయస్పీ మాట్లాడుతూ స్థానిక యువకులు, విద్యార్థులు మత్తు పదార్థలకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు వహించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో రమణ, శివ, నాని, అనిల్, సాయిపాల్గొన్నారు.