Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ రేసు లకీë అధ్యక్షతన జరిగింది. మండల పరిషత్ సమావేశపు జరిగిన సమావేశం చివరి వరకూ తూతూ మంత్రంగా సాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలలో బియ్యం కోసం వెళ్లే గర్భీణీలలల్లో కొందరికి వేలి ముద్రలు పడని సమస్య ఉందని దీంతో పాటు అంగన్వాడీ ఆయా పోస్టులు సకాలంలో భర్తీ చేయాలని దుమ్ముగూడెం ఎంపీటీసీ అధికారులను ప్రశ్నించారు. ఎల్ఎన్రావు పేట గ్రామంలో గల అంగన్వాడీ భవనం శిధిలావస్థకు చేరుకుందని పర్ణశాల ఎంపీటీసీ తెల్లం భీమరాజు అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. సామాన్యుడికి కూడా వేలల్లో కరెంట్ బిల్లులు వస్తున్నాయని రామారావు పేట ఎంపీటీసీ యలమంచి వంశీ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు మంచినీటి సదుపాయం కల్పించడం లేదని అధికారులను నిలదీశారు. అంజిబాక, బట్టిగూడెం గ్రామాలలో నేటికి మిషన్ భగీరధ పైపు లైన్లు వేయలేదని ఎంపీటీసీ మడకం రామారావు అధికారులను ప్రశ్నించారు. అచ్చుతాపురం, లకీëనగరం రహదారి నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని లకీëనగరం సర్పంచ్ సరియం రాజమ్మ అధికారుల దృష్టికి తీసుకు పోయారు. నందుల చెలక తాలిపేరు కెనాల్ బ్యాంకింగ్ బలోపేతానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఏఈ రాజ్ సుహాస్ తెలిపారు. సెర్ఫ్ ఆద్వర్యంలో డాక్రా గ్రూపు సంఘాలకు జనరిక్ మందుల షాపులు ఏపిఎమ్ హేమంతిని తెలిపారు. గ్రామపంచాయతీలలో తడి చెత్త నుంచే వానపాముల అవరం లేకుండా ఎరువు తయారు చేయించాలని ఎంపీఓ ముత్యాలరావు సూచించారు. ఈ విషయమై పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలకీë మాట్టాడుతూ గ్రామ పంచాయతీ నుండి కేటాయించిన నిధుల బిల్లులు సకాలంలో అందడం లేదని దీని వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె అధికారులకు తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీడీఓ చంద్రమౌళితో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.