Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
పని కోసం ప్రయత్నించండి పస్తులుండే పరిస్థితి వస్తే జీవనోపాధి కల్పిస్తామని, నిరుపేద కుటుంబాలను ఎంచుకొని జీవనోపాధి కల్పిస్తున్న జేడీ ఫౌండేషన్ సేవలు వెల కట్టలేవని భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. అలాగే భర్తను కోల్పోయి పిల్లలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం ప్రశంసనీయమని ఆయన తెలిపారు. ఈ మేరకు స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిరుపేద మహిళకు కుట్టు మిషను ఏఎస్పి అందజేశారు. కుకునూరు గ్రామానికి చెందిన బంట ఆదిలక్ష్మి గత సంవత్సరం భర్త పాముకాటుతో మరణించగా ఉన్న ఒక్క ఆడపిల్ల ప్రమాదవశాత్తు కంటికి గాయం అయ్యి ఒక కన్ను కోల్పోయింది. ఆదిలక్ష్మి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నందున ఆవిడకి భద్రాచలం పట్టణంలో కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి ఏఎస్పీ చేతుల మీదుగా కుట్టుమిషన్ అందజేశారు. ఈ సందర్భంగా పౌండేషన్ కన్వీనర్ కె.మురళీ మోహన్ కుమార్ మాట్లాడుతూ ఈ కుట్టు మిషన్ని హైదరాబాద్ చెందిన ప్రాజెక్టు ప్రిష డైరెక్టర్ జొన్నల గడ్డ యశస్విని, దోసపాటి రాముల సహకారంతో అందించినట్లు తెలిపారు. అలాగే ఈమెకి అవసరమైన నిత్యావసర సరుకులను ముదునూరి లతేంద్ర వర్మ, జెడి ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సహకారంతో అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణతో పాటు ఫౌండేషన్ సభ్యులు కడాలి నాగరాజు, అంబిక సురేష్, యూసుఫ్ మియా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు జీతురాం తదితరులు పాల్గొన్నారు.