Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీడ్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన బూర్గంపాడులోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరు, అందుతున్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మాణంలో ఉన్న కేజీబీవీ వసతిగృహాన్ని సందర్శించి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంట ఎస్వో సుశీల, ఉపాధ్యాయులు, విద్యార్ధినులు పాల్గొన్నారు.